28-08-2024 03:00:29 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 27,(విజయక్రాంతి): ‘ కోర్టు ఆర్డర్‌తో నాకు పనేంటి.. ఎవ రు అడ్డం వస్తారో రమ్మను’ అన్నట్లు స్టేటస్‌కో ఉన్న ప్రభుత్వ భూమిలో ఓ కబ్జాదారుడు సాగు చేస్తున్నాడు. జిల్లాలోని పాల్వంచ పట్ట ణ పరిధిలోని వెంగళరావు కాలనీలో గల స ర్వే నెం 727/1 ప్రభుత్వ భూమి వివాదంలో చిక్కుకొని 2017లో కోర్టుమెట్లు ఎక్కింది. కో ర్టు స్టేటస్‌కో జారీ చేసి ఆ భూమిలోకి ఎవరూ వెళ్లవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. స్టేటస్ కో ఈనెల 31వ తేదీ వరకు అ మలులో ఉంది. అయినా ఆ ఆక్రమణదారు డు కోర్టు ఆర్డర్ ను ధిక్కరించి సేద్యం చేస్తున్నా రు. ఆక్రమణదారుడు సర్వే నెంబర్‌ను మార్చి అదే భూమి ని 727/31/అ నెంబర్ చూపి సు మారు 3.1 0 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు.
రెవెన్యూ అధికారులు మాత్రం అతను సేద్యం చేస్తున్నది ప్ర భుత్వ భూమి అని చెబుతున్నారు. ఇదిలా ఉ ంటే ఆక్రమణదారుడు మా త్రం కోర్టు వివాదంలోని భూమితో పాటు సమీపంలోని నా లాలను సైతం ఆక్రమించి సాగు చేపట్టాడు. విషయం తెలుసుకొన్న రెవెన్యూ అధికారి రవి కుమార్ మంగళవారం సంఘటన స్థలానికి వెళ్లి ప్రశ్నించగా అతనిపై తిరగపడ్డాడు. గతంలోనూ తన భూమికి ఎవరు అడ్డం వస్తారో రమ్మంటూ గొడ్డలితో నరుకుతా అని తహసీల్దార్ కార్యాలయంలోనే బెదిరించిన ఘటన సీసీ ఫుటేజీలో రికార్డు అయి ఉన్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా అతనిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోక పోవడంపై అనేక అనుమానాలు వెలువడుతు న్నాయి. ఈ విషయమై పాల్వంచ పట్టణ ఆర్‌ఐ రవికుమార్‌ను వివరణ కోరగా కోర్టు ఆర్డర్ ఉన్నా దున్నుతున్నట్లు తెలుసుకొని వెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తే తనపై తిరగబడ్డాడని, రిపోర్టు తహసీల్దార్‌కు నివేదించామన్నారు.