calender_icon.png 5 November, 2024 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీరేం చేస్తున్నారు?

05-11-2024 01:13:26 AM

  1. బాణసంచా నిషేధించినా ఎలా కాల్చారు?
  2. ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీం అసహనం
  3. ఢిల్లీ ప్రభుత్వం, పోలీస్ కమిషనర్‌కు నోటీసులు

న్యూఢిల్లీ, నవంబర్ 4: దీపావళి పండుగ వేళ బాణసంచా నిషేధం అమలు విషయంలో ఢిల్లీ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధానిలో బాణసంచా కాల్చడంపై ఉన్న నిషేధం అమలుకావడం లేదని తెలిపింది. దీని కారణంగా ఢిల్లీలో మరింత కాలుష్యం పెరిగి గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించిందని తెలిపింది.

ఈ మేరకు సోమవారం అత్యున్నత న్యాయస్థానం ధిల్లీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. బాణసంచా వినియోగంపై పూర్తి నిషేధం అమలుకు తీసుకున్న చర్యలను తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వచ్చే ఏడాది నిషేధానికి సంబంధించి కూడా ప్రతిపాదిత చర్యలను తెలపాలని జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 

కాగా దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం వలన ఢిల్లీవాసులు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. నగరంలోని మెజార్టీ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఎక్యూఐ) 400 మార్కును దాటిందంటే కాలుష్యం ఏ రేంజ్‌లో ఉందో అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీం స్పందిస్తూ.. గత రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు.

దీపావళికి తోడు పంట వ్యర్థాల కాల్చివేతలు కూడా ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గత 10 రోజుల్లో పంట వ్యర్థాల దగ్ధం కేసుల నమోదును తెలుపుతూ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

రికార్డు స్థాయికి లాహోర్‌లో కాలుష్యం..

పాకిస్థాన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన లాహోర్‌లో వాయు కాలుష్యం రికార్డు స్థాయికి చేరింది. నగరం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1,067గా నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా 14 మిలియన్ల మంది నివాసితులు ఉక్కిరిబిక్కిరి అవతున్నారు. ఈ వాయుకాలుష్యా నికి భారతే కారణమని పాకిస్థాన్ మంత్రి జౌరంగజేబ్ ఆరోపించారు.

భారత్ నుంచి బలమైన గాలులు పాకిస్థాన్‌లోకి వీయడంతో వాతావరణంలో మార్పులు సంభవించి వాయుకాలుష్యం పెరిగిపోతోంది. ప్రపంచలో అత్యంత కలుషిత వాయు నగరాల జాబితాలో ఆదివారం రెండోసారి లాహోర్ అగ్రస్థానంలో నిలిచింంది. ఆదివారం సాయంత్రానికి ఇక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  ఇక్క 1067కి పెరిగింది.

కాలుష్యం పెరిగిపోవడంతో లాహోర్‌లోని పాఠశాలలను ఒక వారం పాటు మూసివేయనున్నారు. అలాగే ‘గ్రీన్ లాక్‌డౌన్’లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్  కంపెనీలలో 50 శాతం మంది ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం పనిచేయాలని ఆయా సంస్థలు కోరాయి.