calender_icon.png 27 December, 2024 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమానంపై ఆ రంధ్రాలేంటి?

27-12-2024 02:04:12 AM

  • అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్ ప్రమాద చిత్రాలు వైరల్
  • రష్యా దాడుల నేపథ్యంలో ఘటన!
  • అనుమానం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

బాకు, డిసెంబర్ 26: అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జే2 విమానం కూలి 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. ఈ ఘటనలో కుట్రకోణం ఉన్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాకు నగరం నుంచి రష్యాలోని గ్రోజ్నికి బయలుదేరిన విమానం కజికిస్తాన్‌లోని ఆక్టావ్‌లో కూలిపోయింది. పక్షి ఢీకొనడంతో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ పేర్కొంది.

కాగా, ప్రమాద దృశ్యాలను చూసి న నెటిజన్లు మాత్రం ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రష్యా మధ్య అదే సమయంలో దాడులు జరగడమే అందుకు కారణం. దానిని కీవ్‌కు చెందిన డ్రోన్‌గా భావించి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్టుగా అనుమానిస్తున్నా రు. ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతున్న సమయంలోనే పైలట్ అప్రమ త్తమై ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కొన్ని చిత్రాల్లో విమానంపై బుల్లెట్ల ఆనవాళ్లు కనిపించినట్టు కూడా తెలిపాయి.

అయితే ఈ కథనాలపై కజికిస్థాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించగా కచ్చితమైన సమాధానం రాలే దు. కాగా.. క్రిస్మస్ సమయంలోనూ ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కొనసాగించింది. విద్యుత్తు కేంద్రాలే లక్ష్యంగా 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో దాడులు చేసిందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. తాము కనీసం 50 క్షిపనులు, పలు డ్రోన్లను కూల్చినట్టు ఆయన వివరించారు. రష్యా ప్రయోగించిన వాటిలో బాలిస్టి క్ మిసైల్స్ కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశపూ ర్వకంగానే పండుగ రోజు దాడులు చేయించారని జెలెన్‌స్కీ ఆరోపించారు.