calender_icon.png 23 December, 2024 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో సమయపాలనేదీ?

22-12-2024 12:57:57 AM

* సభ తీరుపై హరీశ్‌రావు అసహనం

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల్లో సమయపాలన లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశా రు. శనివారం సెషన్ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై ఆ యన స్పందించారు. ఉదయం 10. 10 గంటలకు సభ ప్రారంభమైంద ని, ఈ సెషన్‌లో ఏ ఒక్కరోజు కూడా సరైన సమయానికి సభ మొదలు కాలేదని వ్యాఖ్యానించారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మనమే ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని స్పీకర్‌కు సూచించారు. 

సభను అవమానిస్తున్నారు: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రతిసారి శాసనసభ నిర్వహణను అ వమానిస్తున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా రు. సభను ఎంత ఆలస్యంగా ప్రారంభించామో కాదు.. ఎంత సమర్థవం తంగా నిర్వహించామో చూడాలని సూచించారు. ఎంతో ప్రతిష్టాత్మకమై న భూ భారతిపై చర్చ నిర్వహిస్తే ప్రతిపక్ష నాయకుడే సభకు రావడం లే దని విమర్శించారు.