రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కుక్కలను జనవాసాలకు దూరంగా వదిలి పెట్టాలి. కానీ, ఎక్కడా అలాంటి చర్యలు చేపట్టడం లేదని తెలుస్తున్నది. వాటి నియంత్రణకు మాత్రం అధికారులు నిధులు ఖర్చు చేస్తున్నట్టు లెక్కలను మాత్రం చూపిస్తున్నారు. బయట శునకాలు స్త్వుర విహారం చేస్తూ జనాలపై దాడులు చేస్తున్నాయి. ఇలాం టి పరిస్థితుల్లో పిల్లలను ఇంటినుంచి బయటికి పంపించడానికే తల్లిదం డ్రులు భయపడుతున్నారు. వీధికుక్కలకు వ్యాక్సిన్ వేసి, వాటి సం తతి అదుపునకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇదేమీ పట్టించుకోవడం లేదు. వీధుల్లో వాటి విచ్చలవిడి సంచార నియంత్రణకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో అవి జనాలపై దాడులు చేస్తున్నాయని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హై కోర్టు మొట్టికాయ వేసినా ప్రభుత్వంలో చలనం లేకపోతే ఎలా? ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
వావిలాల రాజశేఖర్ శర్మ, నాగర్ కర్నూల్ జిల్లా