19-03-2025 08:17:03 PM
రాష్ట్ర బడ్జెట్ లో సంగారెడ్డి జిల్లాకు మొండిచేయి..
కార్మికులకు కనీస వేతన ఊసే లేదు..
ప్రభుత్వ హామీలు అమలుకు మొక్కు బడి నిధులు..
సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు..
సంగారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో జిల్లాకు మొండి చేయి చూపించారని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ఆరోపించారు. మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు మెట్రోకు నిధులు కేటాయించలేద్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మెట్రో రైలుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తున్నా ఈ ప్రాంతంకు మెట్రో తప్పనిసరిగా కేటాయించాలని అన్నారు.
కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో రోడ్ల నిర్మాణంకు నిధులు కేటాయించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలు కార్మికులకు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ హామీలు అమలుకు నిధులు కేటాయించి డిమాండ్ చేశారు. బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.