calender_icon.png 20 September, 2024 | 3:29 AM

విద్యార్థుల అభ్యున్నతికి నిధులేవి ?

27-07-2024 01:50:14 AM

  • భువనగిరిలో బీసీ విద్యార్థి సంఘం నాయకుల ఆందోళన

యాదాద్రి భువనగిరి, జూలై 26 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి నిధుల కేటాయింపులో అ న్యాయం చేశాయని ఆరోపిస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొ మ్మలను దహనం చేశారు. ఈ ఆందోళనకు బీఆర్‌ఎస్, బీఎస్పీ, అఖిలపక్షాలు మద్దతు ప్రకటించాయి. అయితే, విద్యార్థుల ఆందోళనలో దిష్టిబొమ్మల దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించడానికి బడ్జెట్‌లను సవరించాలని విద్యార్థి సంఘం నాయకులు డి మాండ్ చేశారు. ఆందోళనలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొల్ల మోదీరాందేవ్, గుండెబోయిన శంకర్, దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రాంచంద్రయ్య, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, పాండు, కౌన్సిలర్ భగత్ పాల్గొన్నారు.