11-03-2025 11:46:01 PM
నివేదిక సమర్పించాలంటూ కేంద్రానికి సుప్రీం నోటీసులు..
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో దివ్యాంగ ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. అలాగే జైళ్లలో పీడబ్ల్యూడీ యాక్ట్ అమలు తీరును కూడా వివరించాలని సూచించింది. జైళ్లలో దివ్యాంగులకు సరైన వసతులు లేకపోవడం వల్లే ప్రొఫెసర్ సాయిబాబ, ఫాదర్ స్టాన్‌స్వామి మరణించారని ఆరోపిస్తూ సత్యన్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.