calender_icon.png 24 October, 2024 | 9:00 PM

కమీషన్లు ఏవీ?

11-07-2024 01:17:23 AM

  • నాలుగు సీజన్లుగా ఏజెన్సీలకు 

సివిల్ సప్లయ్ బకాయిలు రూ.19.9కోట్లు

మంచిర్యాల, జూలై 10 (విజయక్రాంతి): జిల్లాలోని రైతులు పండించిన ధాన్యాన్ని సివిల్ సప్లయ్ అధికారుల ఆదేశాల మేరకు ఐకేపీ (డీఆర్ డీఏ), పీఏసీఎస్ (డీసీఓ), డీసీఎంఎస్, మెఫ్మా(డీఆర్‌డీఏ) ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఏటా వానకాలం, యాసంగి సీజన్‌ల కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేసిన ఏజెన్సీలకు సివిల్ సప్లయ్ అందించే కమీషన్ గడిచిన నాలుగు సీజన్‌లుగా (2022-23, 2023-24) ఇవ్వకపోవడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. 

కొనుగోలు చేసిన ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.32, సాధారణ రకానికి క్వింటాలుకు రూ.31.50 కమీషన్ రూపంలో చెల్లించాలి. ఈ లెక్కన 2022 వానాకాలంలో 1,58,336.880 మెట్రిక్ టన్నులకుగాను రూ.4,93,62,549.20, యాసంగిలో 1,86,113.040 మెట్రిక్ టన్నులకు రూ.5,85,11,150.80, 2023-24 వానాకాలంలో 1,39,663.840 మెట్రిక్ టన్నులకు రూ.4,33,29,118, యాసంగిలో 1,55,067.760 మెట్రిక్ టన్నులకు రూ.4,81,54,650.40 కమీషన్ రూపంలో ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంది. ఇలా నాలుగు సీజన్లకు రూ.19,93,57,468.40 సివిల్ సప్లయ్ అధికారులు ఇవ్వాల్సి ఉంది. కొనుగోళ్ల సమయంలో పెట్టుబడులు పెట్టిన మహిళా సంఘ సభ్యులు, రైతుసేవా సమితి సభ్యులు కమీషన్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. 

ఆపింది గోదాం ప్యాడీ లెక్కల కోసమేనా?

అధికారులు మిల్లులకు తరలించగా మిగిలిన ధాన్యాన్ని గోదాముల్లో ఏజెన్సీలను బాధ్యులను చేస్తూ సివిల్ సప్లయ్ అధికారులు దింపించారు. 2021 యాసంగి సీజన్‌లో డీఆర్‌డీఏ ఏజెన్సీ భీమారం, చెన్నూర్, జన్నారం, వేమనపల్లి ఇంటర్మీడియట్ గోదాముల్లో 7,859.080 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ఏజెన్సీ భీమారం, కోటపల్లి, లింగాపూర్ ఇంటర్మీడియట్ గోదాముల్లో 4,404 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఏజెన్సీ చెన్నూర్, జన్నారం, కాసిపేట, రేచిని, వేమనపల్లి ఇంటర్మీడియట్ గోదాముల్లో 11,692.840 మెట్రిక్ టన్నుల ధాన్యం దించాయి. ఈ ధాన్యాన్ని ఏజెన్సీలు గోదాముల నుంచి మిల్లులకు తరలించాయి. కానీ ఎంతమేరకు తరలించారో లెక్క తేలకపోవడంతో ఏజెన్సీలకు ఇచ్చే కమీషన్ ఆపినట్లు సమాచారం. మరోవైపు 2022 యాసంగి ధాన్యం షిప్టింగ్ కొనసాగుతోంది. 

గోదాం స్టాకులో షార్టేజి వస్తే కమీషన్ అంతేనా!

గోదాముల్లో ధాన్యం నిలువ ఉంచడం వల్ల ధాన్యం వెయిట్ లాస్ అవడం సాధారణమే. ఒక ధాన్యంబస్తా 40.650 కిలోలు ఉండగా ప్రస్తుతం అవి 38, 39 కిలోలే తూకం వస్తున్నాయి. గోదాంలోని పూర్తి ధాన్యం షిఫ్ట్ అయితే వ్యత్యాసం ఎంత వస్తుందో తేలనుంది. ఈ షార్టేజీని లెక్కేస్తే ఏజెన్సీలకు వచ్చే కమీషన్‌లో దాదాపు 50 నుంచి 60 శాతం తగ్గనుంది. 

త్వరలోనే రెండు సీజన్ల కమీషన్  గెడం గోపాల్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, మంచిర్యాల

2022-23 వానాకాలం, యాసంగి సీజన్‌లతో పాటు 2023 వానాకాలం సీజన్‌కు సంబంధించి రికన్సిలేషన్ పూర్తయింది. యాసంగికి సంబంధించి ఇంకా పూర్తి కాలేదు. 2022-23 లెక్కలు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నాం. గోదాము ప్యాడీ షిఫ్టింగ్‌కు సంబంధించి ఏజెన్సీలు ట్రక్‌షీట్‌లు కార్పొరేషన్‌కు అప్పజెప్పాల్సి ఉంది. అసలు ఎంత దించారు! ఎంత మిల్లులకు పంపించారు! అనేది తేలితే కమీషన్ డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రిసీవ్డ్ ట్రాక్‌షీట్లు ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించాం. అవి అందగానే కమీషన్ డబ్బులు చెక్కుల రూపంలో అందజేస్తాం.

నాలుగు సీజన్లలో పీపీసీలు, అమ్మిన రైతులు, కొన్న ధాన్యం, రావాల్సిన కమీషన్ వివరాలు...

సీజన్                  సెంటర్ల సంఖ్య    అమ్మిన రైతులు        కొనుగోలు చేసిన ధాన్యం        ఏజెన్సీలకు రావాల్సిన కమీషన్

2022-23 వానా కాలం        234 29,685      1,58,336.880 మెట్రిక్ టన్నులు        రూ. 4,93,62,548.20

2022-23 యాసంగి    262                32,544    1,86,113.040 మెట్రిక్ టన్నులు      రూ. 5,85,11,150.80

2023-24 వానా కాలం  246                  22,489      1,39,663.840 మెట్రిక్ టన్నులు        రూ. 4,33,29,118.00

2023-24 యాసంగి        267                26,790              1,55,067.760 మెట్రిక్ టన్నులు          రూ. 4,81,54,650.40

మొత్తం   :                  1009                1,11,508        6,39,181.52 మెట్రిక్ టన్నులు    రూ. 19,93,57,468.40

నాలుగు సీజన్‌లలో ఏజెన్సీల వారిగా కేంద్రాల సంఖ్య, రావాల్సిన కమీషన్...

సీజన్ డీఆర్‌డీఏ కమీషన్ పీఏసీఎస్ కమీషన్ డీసీఎంఎస్ కమీషన్     

2022-23 వానా కాలం  53          రూ. 84,52,365.6        112 రూ. 1,98,47,134.4    69  రూ. 2,10,63,049.2

2023-23 యాసంగి            43        రూ. 73,63,888.8 130      రూ. 2,38,25,754.8  89          రూ. 2,73,21,507.2

2023-24 వానా కాలం          52          రూ. 78,64,906.8 109        రూ. 1,57,01,823.2    85        రూ. 1,97,62,388

2023-24 యాసంగి          130        రూ. 2,61,57,507.2 85      రూ. 1,10,37,155.6 46 రూ. 92,68,330

మొత్తం   :    278      రూ. 4,98,38,668.4 436  రూ. 7,04,11,868 289 రూ. 7,74,15,274.4

* మెప్మా(డీఆర్‌డీఏ) ఏజెన్సీ 2023-24 యాసంగి సీజన్‌లో మాత్రమే 6 కేంద్రాల ద్వారా 5456.960 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 

ఇందుకుగాను రూ. 16,91,657.60 కమీషన్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ నుంచి రావాల్సి ఉంది.