30-04-2025 01:17:11 AM
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన పట్టించుకోని అధికారులు
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 29: విద్యార్థులను తమ బిడ్డలుగా భావించి వారి సంరక్షణ ను కాపాడాల్సిన వార్డెన్లు కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగ లో తొక్కి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు చక్కటి ఉదాహరణ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్సీ హాస్టల్ వార్డెన్ తిరే ఇందుకుదుకు నిదర్శనం .
అక్రమాలకు పాల్పడుతున్న హాస్టల్ వార్డెన్‌పై ఎన్నోసార్లు విద్యార్థినిల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకుఅధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంతో తన అక్రమాలకు తిరుగు లేదని హాస్టల్లో ఉన్న టేకు చెట్లను నరికి వేయించి వాటిని దాచి ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆమె తీరుపై పలువురు పలుసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనారం.
ఉన్నతాధికారులను ఆ వార్డెన్ మచ్చిక చేసుకొని ఆమె ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారని పలుసార్లు ఆరోపణలు వచ్చిన అధికారులు పట్టించుకోలేదు. హాస్టల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడంలో నిర్లక్ష్యం తో పాటు విధుల్లో నిర్లక్ష్యం గా ఉండడం ఆమె వైఖరి సపరేటు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం లో గత వారం రోజుల నుంచి వార్డెన్ తీరుపై పలు కథనాలు వచ్చిన ఉన్నతాధికారులు తమకు ఏమీ తెలియనట్లుగా వ్యవహరించడం పలు ఆరోపణలకు తావిస్తోంది.
ఎస్సీ వసతి గృహం లో ఉన్న టేకు చెట్ల నరికివేత సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన ఆ హాస్టల్ వార్డెన్ పై అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేయకపోవడం గమనార్వం. సంబంధిత శాఖ అధికారులు చేపట్టిన దర్యాప్తులో ఆ వసతి గృహ నిర్వాహకురాలు చేసిన ఘనకార్యం మొత్తం బట్టబయలు అయింది. వసతి గృహంలో 20 టేకుచెట్లు పెద్దవిగా ఉండేవి.
కోతులు వస్తున్నాయని కుంటి సాకులు చెప్పి అటవీ శాఖ అధికారులు నుంచి ఎటువంటి అనుమతి పొందకుండా ఆమె ఇష్టానుసారంగ ఎస్సీ వసతి గృహం లో ఉన్న టేకు చెట్లను నరికి వేయించి టేకు కర్రలను భద్రంగా గదిలో వేసి తాళం వేసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించారు. అయినా కూడా ఇప్పటివరకు ఆ హాస్టల్ వార్డెన్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్వం.
దర్యాప్తు చేపట్టడంతో వసతి గృహ నిర్వాహకురాలు నరికి వేసిన 20 టేకు చెట్ల విలువ సుమారు లక్షపంతొమ్మిది వేల రూపాయలు ఉంటున్నట్లు ఎల్లారెడ్డి రేంజ్ అటవీశాఖ అధికారి ఓంకార్ తెలిపారు. అటవీ శాఖ అధికారులతో పాటు పలువురు ఉన్నత శాఖ అధికారులు కూడా రావడంతో విద్యార్థులకు వచ్చే బియ్యం కూడా వసతి గృహ నిర్వాహకురాలు అమ్ముకుంటున్నట్లు పలుసార్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా ఎస్సీ బాలికల వసతి గృహంలో వసతి గృహ నిర్వాహకురాలు తీరుపై ఉన్నతాధికారు లు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో మరికొంతమంది అధి కారులు తమ ఇష్టానుసారంగా వ్యవహారించే అవకాశాలు ఉన్నట్లు స్థానికులు వాపోతున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఆ హా స్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులకు వచ్చే కాస్మోటిక్ చార్జీలో కూడా విద్యార్థులకు అందజేస్తున్నారో లేదో అని ఆరోపణలు వినిపిస్తున్నా యి. హాస్టల్లో నరికిన టేకు చెట్లపై విచారణ చేపట్టి పై అధికారులకు విన్నవిస్తామని డిఆర్‌ఓ అనురాంజని తెలిపారు. ఈ తతంగం జరిగి 15 రోజులు గడుస్తున్న వార్డెన్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమ నార్వం. ఆరోపణలు వచ్చిన వార్డెన్ ఓ ఉద్యోగ నేత తో పైరవీలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి అక్రమార్కులవై చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజుల్లో మరింత నిబంధనలకు విరుద్ధంగా అధికారులు సిబ్బంది వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సిన్సియర్గా బాధ్యత లు నిర్వహించే ఉద్యోగులు వాపోతున్నారు.
ఇప్పటికైనా ఆ వార్డెన్‌పై చర్యలు తీసుకుంటారా...?
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్సీ హాస్టల్ వార్డెన్ వసతి గృహంలో ఉన్న టేకు కల్ప ఎలాంటి అనుమతి తీసుకోకుండా తన ఇష్టానుసారంగా చెట్లను నరికి వేయించి వాటి ని తరగతి గదిలో దాచి పెట్టడం అటవీశాఖ అధికారులకు కొందరు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆ హాస్టల్ సందర్శించి హాస్టల్ గదిలో ఉన్న టేకు కలపను స్వాధీనం చేసుకున్న విషయాన్ని అటవీశాఖ అధికారులు తేల్చి చెప్పారు. అంతవరకు బాగానే ఉన్నా సంబంధిత వార్డెన్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.