calender_icon.png 16 April, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలెవీ?

16-04-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్15 ( విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు, సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మానవ హక్కు ల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి సీతారాంకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మాట్లాడుతూ ఆదివారం ’కెరమెరి ప్రాథమిక ఆసుపత్రి కీ తలు పులు వేసి వెళ్లిన వైద్య సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు,సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ఆరోపించారు. ఇంతే కాకుండా రోగుల పట్ల వైద్య సిబ్బంది ,వైద్యు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్  మోహన్, జాయింట్ సెక్రెటరీ భానుచందర్, సోషల్ మీడియా కన్వీనర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.