19-02-2025 01:12:51 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా.. ఎక్కడ చూసినా యూట్యూ బ్.. వాట్సాప్, మోజ్, షేర్ చాట్ ఇలా ఎన్నో ప్లాట్‌ఫాంలు. కంటెంట్ క్రియేటర్లకు కావాల్సినంత స్పేస్.. అవసరం అయినదాని కంటే ఎక్కు వగా ఫ్రీడమ్. కానీ ఆ ఫ్రీడమ్‌ను కొంత మంది కంటెంట్ క్రియేటర్లు మిస్ యూజ్ చేస్తున్నారు.
సభ్యసమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేస్తున్నారు. నిత్యం ఎక్కడో చోట అశ్లీల కంటెంట్ అప్‌లోడ్ అవుతూనే ఉంది. అసలు కంటెంట క్రియేటర్లము అని చెప్పుకునేటోళ్లకు చట్టాల గురించి ఇసుమంతైనా భయం లేకపోవడం విచారకరం.
అంతే కాకుండా ఈ సోషల్ మీడియా ప్లా ట్ ఫాంలల్లో అప్‌లోడ్ అయ్యే కంటెంట్‌కు ఎటువంటి సెన్సార్ లేకపోవడంతో ఇటువంటి ఆకతా యిలు రెచ్చిపోతున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుకుంటూ.. మనసుకి నచ్చింది చేస్తూ సమాజానికి చీడపురుగుల్లా మారుతున్నారు.
ఏదో ఒకటి కావాలి..
రణ్‌వీర్ అనే ఓ కంటెంట్ క్రియేటర్ తల్లిదండ్రుల శృంగారం గురించి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్న అనేక మంది దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. ఆ యూట్యూబర్ తన మీద నమోదైన కేసులపై సుప్రీంను ఆశ్రయించాడు. ఈ సందర్భంగా సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసిం ది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి కేంద్రానికి నోటీసులిచ్చింది. ‘ఈ కేసు యూట్యూబర్లు వారి అరాచకాలకు సంబంధించింది. ప్రభుత్వం సోషల్ మీడియా కంటెంట్‌పై చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.
ఆన్లున్ కంటెంట్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యోచిస్తే చాలా సంతోషం. లేకపోతే మేము ఇలాగే చూస్తూ ఊరుకోం. దీనిని నియంత్రించేందుకు తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. మేము ఎక్కువగా ఏమీ చెప్పడం లేదు. ఈ కేసుకు ఉన్న తీవ్రతను మీరు అర్థం చేసుకోండి’. అని బెంచ్ అభిప్రాయపడింది.
అల్హాబాదియాకు చురకలు
రణ్‌వీర్ అల్హాబాదియా అనే యూ ట్యూబర్‌కు సుప్రీం ఊరట కల్పిస్తూనే అ క్షింతలు వేసింది. ఈ కేసును విచారించిన జడ్జిలు రణ్‌వీర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీరు సెలబ్రెటీ అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా. మీరు మాట్లాడింది అశ్లీలత కాకపోతే మరేంటి. నీపైన మోదయిన ఎఫ్‌ఐఆర్‌లను ఎందుకు ఒక్క టి చేయాలి. పాపులారిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు.
మీ మెదడులోని చెత్తనంతా ఈ ప్రోగ్రాం ద్వారా బ యటపెట్టారు కదా? మీ మీద కేవలం రెం డు ఎఫ్‌ఐఆర్‌లు మాత్రమే నమోదయ్యా యి. ఇలా మాట్లాడిన వారికి కోర్టు ఎం దుకు రక్షణ కల్పించాలి’ అని రణ్‌వీర్‌పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసినా కానీ త ర్వాత కరుణించింది. ఈ వ్యాఖ్యల విషయంలో మరో కేసు నమోదు చేయొద్దని పోలీసులను ఆదేశించింది.