calender_icon.png 20 February, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ వెంచర్లపై చర్యలేవి?

18-02-2025 12:00:00 AM

  1. జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలు బేఖాతర్
  2. హద్దులు తీయిస్తే... అంతు చూస్తాం...
  3. ఇష్టారాజ్యంగా ప్రవేట్, ప్రభుత్వ స్థలాలు కబ్జా 
  4. అధికారుల సర్వే సక్రమంగా జరిగేనా..?
  5. అనుమానం వ్యక్తం చేస్తున్న గాంధారి ప్రజలు 
  6. అక్రమాలపై ప్రశ్నించిన విలేకరుల అంతు చూస్తామంటున్న కబ్జాదారులు
  7. పార్టీలు వేరైనా మేమంతా ఒక్కటే..

కామారెడ్డి ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండల కేంద్రంలో కబ్జాదారుల అక్రమాలకు అడ్డు లేకుండా పోతుంది అది ప్రభుత్వ స్థలమా ప్రైవేట్ స్థలమని కాకుండా వారికి నచ్చితే చాలు కబ్జా చేయడమే ఎదుటివారిని బెదిరించడమే, బాధితులకు న్యాయం చేయాలని అడుగుతే విలేకరుల అంతో చూస్తామని ఆ కబ్జాదారు బెదిరించడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీ అంశంగా మారింది.

జిల్లా పంచాయతీ అధికారికి గాంధారి మండల కేంద్రంలోనీ సర్వే నెంబర్ మూడులో జరుగుతున్న  వెంచర్ల అక్రమాలపై ఫిర్యాదు చేయగా జిల్లా పంచాయతీ అధికారి స్పందించి ఎల్లారెడ్డి డి ఎల్ పి ఓ, గాంధారి గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజును  సమ గ్ర విచారణ జరిపి హద్దులు తొలగించాలని, అవి అక్రమ వెంచర్లో ఏర్పాటు చేసిన  ప్లాట్లు కావున ఎవరు కూడా అక్కడి ప్లాట్లు కొనకూడదు, అమ్మకూడదు అని బోర్డువేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వివరాల్లోకి వెళ్తే....గాంధారి మండల కేంద్రంలోని సర్వే నెంబర్ మూడు లో గాంధారి గ్రామపంచాయతీ కార్యదర్శిని సమాచార హక్కు చట్టం ప్రకారం ఆ భూమిలో ప్లాట్లు చేశారు.  ఈ వెంచర్ కు అనుమతులు ఉన్నాయా అని సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా తమ గ్రామపంచాయతీ నుండి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని అట్టి సమాచార హక్కు చట్టం ద్వారా లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు.

ఈ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు ఎప్పుడైతే సదర్ విలేకరి తీసుకున్నారో అప్పటినుండి ఆ విలేకరిని ఎలా బెదిరించాలి అనే దానిపై దృష్టి పెట్టిన సదరు కబ్జాదారు  గత 10 రోజుల క్రితం ఒకసారి, తిరిగి సోమవారం మధ్యవర్తి ద్వారా హద్దులు పీకేస్తే మీ అంతు చూస్తామంటూ బెదిరించారు.

గాంధారిలో ఉన్న రాజకీయ నాయకులం అంతా ఒకటే మేము ఏ పార్టీలో ఉన్నా మా పనులు మేము చేసుకుంటూ వెళ్తాం మాకు ఎవరైనా అడ్డువస్తే వారి అంతూ చూసే వరకు వదలమని సదరు కబ్జాదారు మధ్యవర్తి ద్వారా బెదిరించడం కోసం మేరూపు.

విచారణ సజావుగా సాగేనా ?

గాంధారి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ మూడు లో వెలసిన వెంచర్ పై వేసిన ఫిర్యాదు పై విచారణ ఎంతవరకు వచ్చిందని సోమవారం జిల్లా పంచాయతీ అధికారి ఎల్లారెడ్డి డి ఎల్ పి ఓ ను ఫోన్లో అడగగా తాను గాంధారి గ్రామపంచాయతీకి వెళ్లానని అక్కడ కార్యదర్శి లేడని సమాధానం చెప్పారు. సోమవారం రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు గాంధారి గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీలోనే ఉన్నట్లు సమాచారం. పై విషయాలను గమనిస్తే ఈ విచారణ సక్రమంగా జరిగేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో వేసిన అక్రమ వెంచర్లపై విచారణ జరిగేన ?

గాంధారి మండలంలో అక్రమ వెంచర్లపై విచారణ ముందుకు సాగేనా అని గాంధారి ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం అక్రమ వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయించారని, ఒక వెంచర్ కు ఉండవలసిన బీటీ రోడ్లు, విద్యుత్ దీపాలు, నీటి సౌకర్యం తదితర సౌకర్యాలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు సైతం పేర్కొంటున్నారు. ఆ వెంచర్ లో గ్రామ పంచాయతీకి వదలవలసిన స్థలాన్ని సైతం ఆ వెంచర్ యజమాని ప్లాట్లుగా చేసుకుని విక్రయించాడని పలువురు పేర్కొంటున్నారు.