calender_icon.png 29 November, 2024 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేపై ప్రజలు ఏమంటున్నారు?

29-11-2024 03:13:45 AM

  1. ఎన్యూమరేటర్లను అడిగి  తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
  2. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో వివరాల నమోదు
హైదరాబాద్, నవంబర్ 28(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా చేస్తున్న సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజలు ఏమనుకుంటున్నారని ఎన్యూమరేటర్లను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. గురువారం సర్వేలో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డితో కూడిన ఎన్యూమరేటర్ల బృందం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్యూమరేటర్లకు కుటుంబసభ్యుల వివరాలను వెల్లడించారు.

అలాగే సర్వేపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా వివరాలను నమోదు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేయాలని, ఆ దిశగా ముందుకు సాగాలన్నారు.
మిలిగింది 6,59,839 నివాసాలే.. 

రాష్ట్రంలో కులగణన చివరి దశకు వచ్చింది. గురువారం నాటికి 98 శాతం పూర్తయ్యింది. ఇంకో 6,59,839 నివాసాలు సర్వే చేస్తే కులగణన పూర్తి అవుతుంది. ఇంకా పూర్తి కావాల్సిన ఇళ్లలో ఒక్క హైదరాబాద్‌లోనే 4,54, 240 ఇళ్లు ఉన్నాయి.  ఇప్పటివరకు 81.5శాతం సర్వే పూర్తయ్యింది. కాగా కులగణనలో భాగంగా సేకరించిన డాటా కంప్యూటరీ కరణ వేగంగా సాగుతోంది. గురువారం నాటి కి 39.51లక్షల ఇళ్ల సమాచారాన్ని కంప్యూటరీకరించారు. ములుగులో అత్యధికంగా 82.5 శాతం ఆన్‌లైన్ పూర్తయ్యింది. యాదాద్రి జిల్లా 74.2శాతంతో రెండో స్థానంలో ఉంది.