calender_icon.png 12 February, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహార తనిఖీలేవి..?

11-02-2025 12:00:00 AM

  1. హోటళ్లు, రెస్టారెంట్లపై పర్యవేక్షణ కరువు 
  2. పోలీసు శాఖలోని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మాత్రమే తరుచూ  తనిఖీలు 
  3. కొరవడిన ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు 

వికారాబాద్, ఫిబ్రవరి 10 : మారు తున్న జీవనశైలి, ఉరుకులు పరుగుల జీవ నంతో అత్యధిక శాతం జనాభా ఇంటి భోజనం కంటే హోటళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితు లే ఎక్కువగా ఎదురవుతున్నాయి.  దీన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటు న్నారు. చాలా వరకు హోటళ్లు,రెస్టారెంట్లు బేకరీ నిర్వాహకులు నాణ్యతలేని నిల్వ ఉంచిన భోజనాలు, ఆహార పదార్థాలు అందిస్తూ ప్రజల అనారోగ్యాలకు కారకుల వుతున్నా రు.

ఇదంతా కళ్ళముందే జరుగుతు న్నా, ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం చోద్యం చూస్తుం డడం విమర్శలకు తావిస్తుంది. నిత్యం తనిఖీ ల ద్వారా ఆహార నాణ్యతను పరీక్షించాల్సిన అధికారులు ఆ పని తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ అధికారులు వస్తే నో, వినియోగదారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తేనో తప్ప అధికారులు కాలు కదపడం లేదు. 

 కొరవడిగిన పర్యవేక్షణ..

జిల్లాలో ఆహార తనిఖీలు లేవని అధికా రుల పర్యవేక్షణ కొరవడిందని విమర్శలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో వందల సంఖ్యలో ఓటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంట ర్లు, బేకరీలు ఉన్నాయి. వీటిని ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీ చేయాల్సి ఉన్న అధికారులు  ఆ ప్రక్రియ సక్రమంగా  చేయ డం లేదు. సిబ్బంది కొరత పేరుతో తనిఖీల ను సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శ లు ఉన్నాయి. 

వికారాబాద్ జిల్లాలో పోలీ సు శాఖలోని టాస్క్ఫోర్స్ విభాగం  మాత్ర మే తరచుగా తనిఖీలు చేపడుతున్నరు. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ లు ఎక్కడ కనిపించడం లే దు. పోలీస్ శాఖ టాస్క్ ఫో ర్స్ అధికారులకు తరచుగా నకిలీ ఆహార పదార్థాలు పట్టు బడుతున్న, ఫుడ్ సేఫ్టీ అధికారుల కు కనీసం చలనం రావడం లేదని విమర్శ లు ఉన్నాయి.

ఫలితంగా పలు హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు నిల్వ ఉన్న మాం సం పాడైన ఆహారం భూ జుపట్టిన ఐస్క్రీ మ్లు, కల్తీ అల్లం వెల్లుల్లి వంటి పేస్టులను వాడి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. 

 మునిసిపల్ అధికారుల పట్టింపేది..?

   ఆహారంలో కల్తీ జరగకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు మున్సిపల్ అధికారు లు సైతం పర్యవేక్షించాలి. కానీ వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో మునిసిపల్ అధికారులు హోటళ్లు,రెస్టారెంట్లలో తనిఖీ లు చేసిన దాఖలాలే లేవు. హోటళ్లు అపరి శుభ్రంగా ఉన్నాయని  ఫిర్యాదులు వచ్చినా తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహ రిస్తుండడం గమనర్హం.