- ఇక్కడి పారిశ్రామికవేత్తలు, రియల్టర్లపై వేధింపులు ఆపండి
- తర్వాత అంతా మంచే జరుగుతుంది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): ‘ప్రపంచ దిగ్గజ కంపెనీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీల నుంచి తెలంగాణకు పెట్టుబడులు రావాలి గానీ.. రాష్ట్రానికి చెందిన ఇన్వెస్టర్లను దావోస్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడమేంటో.. నాకు అర్థం కాలే దు’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన భారతరత్న క ర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రియల్టర్లు, పారిశ్రామికవేత్తలను రాష్ట్రప్రభుత్వం వేధిస్తున్నదని, దీంతో పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని వెల్లడించారు.
ముందు వారిపై వేధింపులు ఆపితే చాలని, ఇక అంతా మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వేధింపులు ఆపకుంటే మున్ముందు మరిన్ని అనర్థాలు జరుగుతాయని జోస్యం చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి కర్పూరీ ఠాకూర్ సేవలను కొనియాడారు. ఓబీసీ వర్గాలకు సామాజికంగా, రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని కరూరీ ఠాకూర్ పోరాడారని గుర్తుచేశారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కుటుంబం నిన్నమొన్నటి వరకు ఒక్క నెహ్రూ కుటుంబం తప్ప మరెవ్వరూ దేశాన్ని పరిపాలించలేదని, ఆ హక్కు తమ కే ఉందని భావించేదని, సా ర్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓ డినా వారికి బుద్ధిరాలేదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను ఎన్నికల్లో ఓడించేందు కు నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కుట్ర లు పన్నిందన్నారు.
అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగ విలువలను వల్లెవేయడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగంపై కనీస అవగాహన లేని, రాజ్యాంగం చదవని వ్యక్తి రాహుల్‌గాంధీకి, దాని గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. రాజ్యాంగం, అంబేద్కర్‌పై రాహుల్ గాంధీ తమకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అనంతరం బీజేపీ డైరీని ఆవిష్కరించారు.