calender_icon.png 19 April, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగలకుంట ఎటుపాయే?

18-04-2025 12:00:00 AM

  1. ట్టను నేల ను చేసిండ్రు.. రికార్డుల్లో కుంట 
  2. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ శాఖ 
  3. దొంగలకుంటకు జియో ట్యాగింగ్ గుర్తింపు 
  4. ఎందుకింత నిర్లక్ష్యం అంటూ జనం అసహనం 
  5. ఫిర్యాదు చేశాం : లక్ష్మణ్, ఇరిగేషన్ ఈఈ 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 17 (విజయ క్రాంతి) : పాలమూరు పట్టణంలో దొంగలకుంట దోచుకుంటున్నారని ప్రశ్న రోజురో జుకు ఊపందుకుంటుంది. గత మూడు రోజులుగా దొంగలకుంట భూభాగంపై వస్తున్న ఆరోపణలకు చివర గీతం పాడేందుకు ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకుంటు న్నప్పటికీ ఆశించిన మేరకు అడుగులు ముం దుకు పడడం లేదని తెలుస్తుంది.

జిల్లా ఉన్న త అధికారులు, ఇరిగేషన్ ఉన్నత అధికారులు జిల్లా కేంద్రంలోని ఉన్నప్పటికీ దొంగ లకుంట చెరువు రికార్డుల్లో ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ కట్ట తెగుతున్న అధికార యంత్రాంగం ఆపి ప్రయత్నం మా త్రం చేయలేదు. ఈ భూమి మాదే ఈ కట్ట మాదే అంటూ పట్టాదారులు దొంగల కుం ట కట్ట కాదు మేము వేసిన కట్ట అంటూ కట్టను తొలగించారు.

అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో మాత్రం నిర్ల క్ష్య ప్రదర్శన కనిపిస్తుందని పట్టణవాసులు అధికారులపై అసనం వ్యక్తం చేస్తున్నారు. కాపాడవలసిన అధికారులే కాగితాల కుంట ఉంది ఆ కుంట కాపాడేందుకు ఫిర్యాదు చే శాం..? ఉన్నత అధికారులకు నివేదిక ఇచ్చాం అంటూ కాలయాపన చేస్తూ కుంట కట్ట తెగి న నియంత్రణ చేసే ప్రయత్నం మాత్రం చేయడంలో అధికారం యంత్రాంగం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. 

దొంగలకుంటకు జియో ట్యాగ్గింగ్ గుర్తింపు...

మనిషికి ఒక ఆధార్ కార్డు నెంబర్ ఉన్న ట్టు.. కుంటలకు, చెరువులకు ఇరిగేషన్ శాఖ జియో ట్యాగ్గింగ్ చేసి ప్రత్యేకంగా మార్కింగ్ ఇస్తూ ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ ను కూడా దొంగలకుంట కు ఈ గుర్తింపును ఇరిగేషన్ శాఖ ఇచ్చింది. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమ్మతిత అధికారులు ద్వారా తెలి సింది. పట్టాదారులు మాకు హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయని ఉంటా కట్టను తొలగించారు. అధికారులేము కుంట కట్ట ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదని ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. 

పోలీసులకు ఫిర్యాదు చేశాం..

దొంగలకుంట కట్ట తొలగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రికార్డుల్లో దొంగలకుంట ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తదుపరి చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తీసుకుంటాం. నిబంధనలకు ముందుకు సాగుతాం. 

లక్ష్మణ్, ఇరిగేషన్ ఈఈ, మహబూబ్ నగర్