calender_icon.png 30 April, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులతో చర్చలేంటి?

30-04-2025 12:35:28 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాష్ర్ట ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. రాష్ర్టంలో మావోయిస్టుల ఊసే లేదని, నక్సలిజం పూర్తిగా అంతమైందని ఒక ప్రకటనలో తెలిపారు.

2004 లోనే అప్పటి సీఎం వైఎస్ నక్సల్స్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, అనంతరం అనేక మంది ఎదురుకాల్పుల్లో మృత్యువాత పడ్డారన్నారు. మిగిలిన వారు ఛత్తీస్‌గఢ్, మహారాష్ర్టకు పారిపోయారన్నారు. తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి ఇప్పటి వరకు నక్సల్స్ హింసాత్మక సంఘటనలే లేవన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులతో చర్చల పేరిట రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ఆలోచన చేస్తోందని ఎద్దేవా చేశారు. చత్తీస్‌గఢ్ నుంచి పారిపోతున్న నక్సలైట్లను తెలంగాణలోకి ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారా అని రేవంత్‌ను ప్రశ్నించారు.