calender_icon.png 21 January, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివారుల్లో ‘ఫుడ్ సేఫ్టీ’ అధికారుల జాడేది?

21-01-2025 01:57:02 AM

విచ్చలవిడిగా అపరిశుభ్రత భోజనాలు వడ్డిస్తున్న ప్రైవేట్  హాస్టల్స్, హోటల్స్  వసతి గృహాలలో నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నా.. పట్టించుకోని అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు

అబ్దుల్లాపూర్ మెట్, జనవరి 20: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల వైపు ఫుడ్ సెఫ్టీ అధికారులు కన్నెత్తి చూడడం లేదని పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎందెందు వెళికిన అందందే కలనన్నట్లు ఏ వస్తువులో చూసిన కల్తీతో హైదరాబాద్ ప్రజలు సాహసం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కల్తీతో అనారోగ్యల పాలవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు, శివారు ప్రాంత ప్రజలు కానీ ఎక్కువ శాతం హోటల్ ఫుడ్‌కు మక్కువ చూపుతారు.

దీనిని ఆసరా చేసుకుని విచ్చల విడిగా హోటల్, హాస్టల్, రెస్టారెంట్స్ వెలుస్తున్నాయి. వీటిపైన నిఘా పెట్టాల్సిన ఫుడ్ సెఫ్టీ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నట్లు స్థానికులు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడో ఏడాది ఒకసారి వసర ఫిర్యాదులతో, లేక ఏమైనా -సంఘటనలు జరిగిన్నప్పుడో వస్తున్నా అధికారులు నామ మాత్రపు తనిఖీలు చేసి వెళ్తున్నారు.

తనిఖీలలో అక్కడ దొరికిన కొన్నింటిని చెకింగ్ ల పేరుతో శాంపిల్ లు సేకరిస్తారు కానీ శాంపిల్ సేకరించి వాటిని లాబ్ పంపించి చేతులు దులుపుకుంటున్నారు. ఆ హోటల్స్, హాస్టల్, రెస్టారెంట్లపై ఎలాంటి చర్యలుండవ్.. ఎందుకంటే అధికారులు మామ్ముళ్ల -మత్తులో తుగుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద హోటళ్లల్లో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు కానీ... వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే విధంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ పరిధి పసుమాములలోని ఆల్ రిచ్ డైయిరీపై ఫుడ్‌సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.

అందులో అపరిశుభ్రత వాతావరణంలో పాలు, పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. పాలు, నెయ్యి శాంపిల్ సేకరించి.. ఆ పాల డైయిరీపై ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది.  ప్రజల ఆరోగ్యలతో చెలాగం ఆడుతున్న కల్తీ మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మెట్ లో విచ్చలవిడిగా ’ప్రైవేట్ హాస్టల్’

 మెట్ మండల కేంద్రంలో పరిసరా ప్రాంతాలలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని  మెట్ మండలం కేంద్రంతోపాటు ఆ చుట్టు పక్కల గ్రామాల పరిధిలో విచ్చల విడిగా ప్రైవేట్ హాస్టల్స్ వెలుస్తున్నాయి. ఇంత వరకు భాగనే ఉంది కానీ... వసతి గృహాలలో నిర్వాహణ -మాత్రం అస్తవ్యస్తంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హాస్టల్స్ ఓనర్స్ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ సరైన భోజనాలు మాత్రం పెట్టడంలేదని విద్యార్థులను ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ హాస్టల్స్‌లలో ఉడికి ఉడకని అన్నం.. నీళ్ల చారు పెడుతున్నారన్నారు.  అబ్దుల్లాపూర్‌మెట్  లో ఓ ప్రైవేట్ హాస్టల్స్ ఉంటుంనటువంటి కాలేజీలకు వెళ్లే సమయంలో విద్యార్థులకు లంచ్ బాక్స్ తీసుకెళ్లారు.

అందులో గొంగళి పురుగు అన్నంలో వస్తే... ఆ విద్యార్థులు పురుగులు పడిన అన్నం ఎలా తినాలని హాస్టల్ నిర్వహకులు అడుగగా.. తింటే తిన్నండి... లేకపోతే వదిలేయండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని విద్యార్థులను ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో ఆ విద్యార్థులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి హాస్టల్స్ నిర్వహకులను అడుగగా వారికి కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. తమ పిల్లలను ఇష్టం లేని ముగ్గురు విద్యార్థులు ఆ హాస్టల్స్ ఖాళీ చేశారు. వసతి గృహాల నిర్వాహకులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే సంబంధిత అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు.

మామ్ముళ్ల మత్తు ’ఫుడ్ సెఫ్టీ’ ఆఫీసర్లు..?

రెస్టారెంట్స్, హోటల్స్, బేకరీ తదితర నిర్వహకులు ఇచ్చే మామ్ముళ్లకు అలవాటు పడి ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలను -నిర్వహించడంలేదని ఆరోపిస్తున్నారు. అందుకే ఎక్కడా కూడా తనికీలు నిర్వహించడం లేదు.. ఒక వేళ తనిఖీలు చేయాల్సిన పరిస్థితి వస్తే.. నామ మాత్రంగా తనిఖీలు నిర్వహించి వెళిపోతున్నారు.

ఆ తరువాత అక్కడ అపరిశుభ్రత వాతారణం కనిపించి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో... నిర్వహకులు అడ్డగోలు తమకు ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శలు -వస్తున్నాయి. హాస్టల్స్ దాదాపు స్థానిక ప్రజాప్రతినిధులే కావడంతో ప్రతి రోజు ఏదో ఓ హాస్టల్ సంఘటనలు జరిగినా.. తన అధికార బలంతో లోలోపల కప్పిపుచుతూ.. సమస్యను బయటకు చెప్పిన విద్యార్థులను హాస్టల్స్ నుంచి బయటకు పంపించేసిన ఘటనలు చాలానే ఉన్నాయి.

నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి

ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన హాస్టల్స్‌లో తమ పిల్లలకు సరైనా ఫుడ్ అందించలేకపోతున్నాం అని కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. హాస్టల్స్‌లో సరైన ఫుడ్ పెట్టేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం లేదు. అలాంటి అధికారులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. 

  కూరెళ్ల మహేశ్, విద్యార్థి సంఘ నాయకుడు