calender_icon.png 8 April, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల సంగతేంది?

08-04-2025 01:49:10 AM

  • జీబీ లింక్ గురించి మీకు తెలిసినా మాకెందుకు చెప్పలేదు?

జీఆర్‌ఎంబీపై తెలంగాణ ఆగ్రహం

అన్నీ చెప్పాల్సిన అవసరం లేదన్న సభ్యకార్యదర్శి

హైదరాబాద్, ఏప్రిల్ 7(విజయక్రాంతి) : గోదావరి (జీబీ) లింక్ గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)కు ముందే తెలిసినా తెలంగాణకు చెప్పకుండా, తెలియకుండా దాచిపెట్టిందని మన రాష్ట్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఆ వివరాలను బోర్డుకు ఇచ్చినా, ఆ వివరాలను తమకు పంపాలని కేంద్ర జల్‌శక్తి శాఖ 2024, నవంబర్‌లోనే ఆదేశించినా కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని తెలంగాణ మండి పడింది.

జీఆర్‌ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జీఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి ప్రాజెక్టు గురించి తెలంగాణ సీరియస్‌గా ప్రస్తావించింది. జీఆర్‌ఎంబీ సమాచారం, వివరాలు దాచిపెడు తోందని తెలంగాణ అధికారులు ఆరోపించారు. ప్రాజెక్టు అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి ఐదు నెలలు గడిచాయని, అయినా తమకు కనీస సమాచారం ఇవ్వలేదని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు