calender_icon.png 10 January, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనందమాయే..

10-01-2025 12:00:00 AM

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నుంచి రానున్న నాలుగో సినిమా ‘బ్రహ్మా ఆనం దం’. హాస్య నటుడు బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొత్త దర్శకుడు ఆర్‌వీఎస్ నిఖిల్ డైరెక్షన్‌లో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు.

అందులో భాగంగా గురువారం ఈ సినిమా నుంచి  ‘ఆనందమాయే..’ అనే పాటను విడుదల చేశారు. ఈ ప్రేమగీతంలో హీరోపై తనకున్న ప్రేమను హీరోయిన్ అందంగా వివరిస్తుంటే, హీరో మాత్రం తనకు డబ్బు మీదున్న ప్రేమ, అవసరాన్ని పాట రూపంలో తెలియజేస్తున్నాడు.

ఈ పాటను శ్రీసాయికిరణ్ రాయగా, శాండిల్య పీసపాటి సంగీత సారథ్యంలో మనీషా ఈరబత్తిని, యశ్వంత్ నాగ్ ఆలపించారు. వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుండగా, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మితేశ్ పర్వతనేని డీవోపీగా, ప్రణీత్‌కుమార్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.