calender_icon.png 12 January, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమాత్యయోగం కలేనా!

12-01-2025 01:39:53 AM

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడచిపోయిం ది. రెండు కొత్త సంవత్స వేడుకలను చేసిందీ సర్కారు. అయితే క్యాబినెట్ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ఏడాదిగా చెప్తూనే ఉన్నారు.

అదిగో ఇదిగో అంటూ వాయిదా పడుతూనే ఉంది. ఎవరెవరికి అమాత్యయోగం దక్కుతుందో కూడా చెప్తూ పార్టీ నేతలు మీడియాకు లీకులు ఇస్తూనే ఉన్నారు. కానీ, నేటికీ విస్తరణ జరుగలేదు.. ఒక్కరికీ  అవకాశమే లభించలేదు. దసరాకు అని కొన్ని రోజులు.. సంక్రాంతిలోపు అని మరికొన్ని రోజులు విస్తరణ పర్వంపై లీకులు చక్కర్లు కొట్టా యి. ఇప్పుడు సంక్రాంతి తర్వాత విస్తరణ తప్పకుండా ఉంటుందని ప్రచారం మొదలైంది. ఏళ్లు గడిచిపోతున్నాయి.. తమకు అమాత్యయోగం దక్కేనా అంటూ ఆశావహులు నిట్టూరుస్తున్నారు.