calender_icon.png 12 January, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంత పనాయెనే హరీశన్న

12-01-2025 01:33:00 AM

ఫార్ములా ఈ రేసు కేసు రాష్ట్రంలో ప్రస్తుతం హాట్‌టాపిక్. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకున్న ఈ కేసు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్‌కు ఇక జైలే అంటూ సోషల్ మీడి యాలో మీమ్స్ పేలుతున్నాయి. ఇప్పటికే రేసింగ్ కేసు విషయంలో తలప ట్టుకున్న కేటీఆర్ మెడకు త్వరలో ఓఆర్‌ఆర్ టెండర్ల కేసు చుట్టుకోబోతోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఓఆర్‌ఆర్ టెండర్ల అవినీతిపై చర్చ జరిగింది.

ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించి.. దమ్ముంటే ఓఆర్‌ఆర్ టెండర్లలో అవినీతి జరిగిఉంటే రద్దు చేయాలని సవాల్ విసిరారు. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి సిట్  ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించేశారు. దీంతో ఎరక్కపోయి ఇరుక్కున్న పరిస్థితికి బీఆర్‌ఎస్ నేతలు చేరుకున్నారు. ఇప్పుడు ఓఆర్‌ఆర్ టెండర్ల విచారణ ఎదుర్కోవాల్సింది అప్పటి ఆ శాఖ మంత్రి కేటీఆరే. ఇప్పటికే ఓ కేసులో ఆగం అవుతున్న కేటీఆర్.. మరో కేసు ముంచుకొస్తున్న నేపథ్యంలో ‘ఎంతపని చేశావే హరీశన్న’ అని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.