calender_icon.png 12 March, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంత పనాయే పుష్ప!

22-12-2024 01:26:56 AM

ఎంతపని చేస్తివి పుష్ప! అం టుంది సినిమా పరిశ్రమ. ఇటీవల పుష్ప౨ బెనిఫిట్ షో సంద ర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఇక ముందట రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని  ప్రకటించింది. దీంతో సినీ ఇండస్ట్రీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.

సంధ్య థియేటర్ ఘటన ఇప్పటివరకు అల్లు అర్జున్ వరకే పరిమితం కాగా.. తాజాగా అది సినీ పరిశ్రమ మెడకు చుట్టుకుంది. అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ రోజు థియేటర్‌కు వెళ్లడం, సక్సెస్ ఈవెంట్‌లో సీఎం పేరు మరిచిపోవడం, అరెస్టు తర్వాత ఆయనను పరామర్శించేందుకు కొందరు సినీ ప్రముఖులు క్యూకట్టడం..

ఈ ఉదంతాల్లో ఏ ఒక్కటి జరగకపోయినా నేడు ఈ పరిస్థితి ఉండేది కాదేమోనని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నచోట ఉండకుండా.. అనవసరపు చర్యలతో ఎంత పనిచేశావ్ ‘పుష్పరాజ్’ అంటూ సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు.        

కొడవలికంటి నవీన్