calender_icon.png 18 April, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

10-04-2025 09:34:02 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎంబి నర్సిరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన బూర్గంపాడు మార్కెట్ యార్డులో రైతులు ధాన్యం మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు సకాలంలో వ్యవసాయ మార్కెట్ అధికారులు, సొసైటీ అధికారులు పరదాలు ఇవ్వకపోవడం వలన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయి మొక్కలు వస్తున్నాయని రైతులు తెలిపారు. సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని గురువారం నాడు సందర్శించారు.

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతుల పంట తడిసి ముద్దయిందని ఒక రైతు ఆవేదనతో ధాన్యం తడిసిపోతుంది పరదాలు ఇవ్వండి అని అడిగిన, ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చనిపోతా అని వేడుకున్న కూడా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడం వారి పైన చర్యలు తీసుకోవాలని తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని పరదాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు బయ్యా రాము, ఎస్కే అబిదా, రాయల వెంకటేశ్వర్లు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.