దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు
గయానా: దక్షిణాఫ్రికా, ఆతిథ్య వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. సఫారీ జట్టు విండీస్ ముంగిట 263 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపటి వార్తలందేసరికి వెస్టిండీస్ రెండు వికెట్లు నష్టపోయి 5౬ పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీసీ కార్టీ క్రీజులో ఉన్నారు. మ్యాచ్‌కు మరో రెండు రోజులు మిగిలి ఉండడంతో సౌతాఫ్రికా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రొటిస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. వెరిన్నే (78 బంతుల్లో 59) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మార్కరమ్ (108 బంతుల్లో 51) అర్థసెంచరీతో రాణించగా.. ముల్డర్ 34 పరుగులు చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో తక్కు వ పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది. బౌలింగ్‌కు విప రీతంగా సహకరిస్తున్న పిచ్‌పై ఆచితూచి ఆడి న సఫారీ బ్యాటర్లు పరుగులు రాబట్టారు. విండీస్ బౌలర్లలో జెడెన్ సీల్స్ 6 వికెట్లు పడగొట్టగా.. మోటీ, వర్రికాన్ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 160పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే కుప్పకూలడం తో సౌతాఫ్రికాకు 16 పరుగుల స్వల్ప ఆధి క్యం లభించింది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.