calender_icon.png 27 December, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెస్టిండీస్‌దే వన్డే సిరీస్

08-11-2024 01:14:49 AM

మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి

బ్రిడ్జ్‌టౌన్: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మౌస్లే (57) అర్థసెంచరీతో రాణించాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 3 వికెట్లు తీయగా.. జోసెఫ్, షెపర్డ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 43 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కీసి కార్టీ  (128 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. బ్రాండన్ కింగ్ (102) సెంచరీతో చెలరేగాడు. టోప్లే, ఒవర్టన్ చెరొక వికెట్ తీశారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బ్రాండన్ కింగ్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ మాథ్యూ ఫోర్డ్ గెలుచుకున్నారు.