బ్రిడ్జ్‌టౌన్: టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య వెస్టిండీస్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సూపర్ భాగంగా గ్రూప్ శనివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా విండీస్ బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీస్ గౌస్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నితీశ్ కుమార్ (19 బంతుల్లో 20), మిలింద్ కుమార్ (19) పర్వాలేదనిపించారు.
వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్, ఆండ్రీ రసెల్ చెరో 3 వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ జట్టు 10.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 130 పరుగులు చేసి గెలుపొందింది. షై హోప్ (39 బంతుల్లో 82 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. జాన్సన్ చార్లెస్ (15) ఔటైనప్పటికీ.. నికోలస్ పూరన్ (12 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. అమెరికా బౌలర్లలో హర్మీత్ సింగ్ ఒక వికెట్ తీశాడు. ధనాధన్ బాదుడుతో నెట్ రన్‌రేట్‌ను గణనీయంగా పెంచుకున్న విండీస్ సెమీస్ రేసులో.. ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. బౌలింగ్‌లో మెరిసిన రోస్టన్ చేజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నాడు.