calender_icon.png 3 October, 2024 | 8:08 AM

నిప్పు కణికలా పశ్చిమాసియా

03-10-2024 12:38:02 AM

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడితో ఉద్రిక్తతలు తీవ్రం

ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ఆందోళన

ప్రతీకారం తీర్చుకుంటామని నెతన్యాహు హెచ్చరిక

తమ చర్య ముగిసిందని ప్రకటించిన ఇరాన్

టెల్‌అవీవ్ (ఇజ్రాయెల్), అక్టోబర్ 2: ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమ య్యాయి. దీంతో పశ్చిమాసియాలో ఏ క్షణ ంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

మంగళవారం రాత్రి వందలకొద్దీ రాకెట్లు, బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పైనా రాకెట్లు సంధించింది. ఇందులో ఒకటి మొస్సాద్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో పడటంతో ఆ ప్రాం తంలో భారీ గుంత ఏర్పడింది.

ఆ సమయం లో పెద్ద ఎత్తున దుమ్మురేగడంతో స్థానికం గా ఉన్న వాహనాలన్నీ మట్టిలో కూరుకుపోయాయి. ఈ గుంతకు సంబంధించిన దృశ్యా లు వైరల్‌గా మారాయి. ఇరాన్ దాడితో అప్రమ త్తమైన ఇజ్రాయెల్ ప్రజలను అలర్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా సైరన్లు మోగించింది.

రక్షణాత్మక చర్య

ఇజ్రాయెల్‌పై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 పేరుతో ఈ దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. నెవాటిమ్ వాయుస్థావరంతో పాటు అక్కడున్న ఎఫ్ ఫైటర్ జెట్లు, మిలిటరీ స్థావరాలు, రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ప్రకటించింది. జూలైలో హమాస్ నాయకుడు ఇస్మాయెల్ హనియే హత్యకు ప్రతిగా ఇజ్రాయెల్‌పై దాడులు చేసినట్లు చెప్పింది.

ఇది తమ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా అభివర్ణి స్తూ తన చర్యలను రక్షణాత్మకంగానే చూడాలని చెప్పింది. 90 శాతం క్షిపణులు లక్ష్యాన్ని ఛేదించాయని, అయితే ఎవరికీ గాయాలైనట్లు ఇజ్రాయెల్ నివేదించలేదని ఇరాన్ మిలిటరీ వెల్లడించింది. ఇక్కడితో తమ దాడి ముగిసిందని, ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే భారీ విధ్వంసం తప్పదని టెహరాన్ హెచ్చరించింది. 

భారీ మూల్యం చెల్లించాల్సిందే

ఇరాన్ దాడుల నేపథ్యంలో జెరూసలెం లో అధికారులతో మంగళవారం రాత్రి అధికారులతో క్యాబినెట్ సమావేశంలో నెతన్యా హు పాల్గొన్నారు. ఇరాన్ చర్యలపై మండిపడిన ఆయన శత్రుదేశ దాడి విఫలమైందని పేర్కొన్నారు. అత్యంత అధునాతన రక్షణ వ్యవస్థతోనే ఇది సాధ్యమైందన్నారు. తమకు అండగా నిలిచిన అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంగళవారం ఇరాన్ చేసింది అతిపెద్ద తప్పు. ఇందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. 

ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి? 

దాడుల విషయంలో సమాధానం చెప్పా ల్సి ఉంటుందని, ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండదని విదేశాంగ మంత్రి కాట్జ్ కూడా హెచ్చరించారు. ప్రతిగా తమ స్పందన మరింత తీవ్రంగా ఉంటుందని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ప్రతీకారం విషయంలో ఇజ్రాయెల్ దేనిని టార్గెట్ చేస్తుందనే అంశం చర్చనీయాంశమైంది.

ఇరాన్‌కు పశ్చిమ దేశాలతో ఘర్షణకు ప్రధాన కారణమైన అణు స్థావరాలను ఇజ్రాయెల్ ఎంచుకుంటుందని విశ్లే షకులు అంటున్నారు. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. మిడిల్‌ఈస్ట్ ముఖచిత్రం మార్చేందుకు ఇజ్రాయెల్‌కు ఇది అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు.

మరోవైపు నిరంకుశ పాలనను అంతం చేస్తామన్న నెతన్యాహు ప్రకటనను పరిశీలిస్తే.. ఇజ్రాయెల్ గురి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై ఉన్నట్లు తెలుస్తోంది. టెల్‌అవీవ్‌పై దాడులతో పాటు పశ్చిమాసియాను అస్థిరపరచడం వెనుక ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారని ఇజ్రాయెల్ సైనికాధికారులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అణు సామర్థ్యాన్ని ధ్వం సం చేయాలని పేర్కొన్నారు. 

ఇరాన్‌కు ప్రయాణాలు వద్దు: భారత్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత పౌరులకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. ప్రస్తు తం ఇరాన్‌లో ఉన్నవారు అప్రమత్తంగా ఉం డాలని, అవసరమైతే టెహారాన్‌లోని భారత ఎంబసీని సంప్రదించాలని పేర్కొంది. 

ఇది చిన్న పిల్లల కొట్లాట

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని ఇద్దరు చిన్న పిల్లల కొట్లాటలా ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఇది వాస్తవానికి చెడు విషయం. యుద్ధానికి ముగింపు పలకాలి. స్కూల్‌లో ఇద్దరు చిన్నారులు కొట్టుకున్నట్లుగా ఉంది. అక్కడ ఏం జరగుతుందో గమనిస్తున్నాం. ఇది భయంకరమైన యుద్ధం. ఇది ఎక్కడ ఆగుతుందో ఎవరికైనా తెలుసా? ప్రతి ఒక్క రూ జీవించాలి.

అందువల్ల ఈ విషయం లో అమెరికా మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘర్షణలు మూడో ప్రపంచయుద్ధానికి దారితీసేలా ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు మధ్యప్రాచ్యంలో ఎలాంటి ఘర్షణలు లేవని, ప్రస్తుత పాలకులు అసమర్థులని ఆరోపించారు.

గుటెర్రస్‌పై ఇజ్రాయెల్ నిషేధం 

ఇరాన్ భీకర దాడిని నిస్సందేహంగా ఖండించడంలో ఐరాస ప్రధాన కార్యద ర్శి అంటోనియో గుటెర్రస్ విఫలమయ్యారని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ మేరకు తమ దేశంలోకి రాకుండా నిషే ధం విధిస్తున్నట్లు విదేశాంగమంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ బుధవారం వెల్లడించారు. ఆయన సహకరించినా లేకున్నా ఇజ్రాయెల్ ఎప్పుడూ తమ పౌరులు, జాతీయ గౌరవాన్ని కాపాడుకుంటుందని ప్రకటించారు.

మంగళవారం దాడులపై స్పంది స్తూ.. మధ్యప్రాచ్యంలో ఘర్షణ తీవ్రతరమైంది. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇది ఆగి పోవాలి. కాల్పుల విరమణ కోరుకుంటు న్నాం గుటెర్రస్ ట్వీట్ చేశారు. ఈ ప్రకటనలో ఇరాన్ పేరును ప్రస్తావించకపో వడంపై కాట్జ్ పైవిధంగా స్పందించారు. 

ఎవరెవరు ఏమన్నారంటే.. 

* మిడిల్‌ఈస్ట్‌లో అంతర్యుద్ధాలు, ఘర్షణలకు అమెరికా, యూరోప్ దేశాలే కారణం. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన పేరిట వస్తున్నవాళ్ల సమక్షం లోనే ఇదంతా జరుగుతోంది. వాళ్లు ఇక్కడినుంచి వైదొలిగితే ఇవన్నీ ఆగి పోతాయి. ఇస్లామిక్ విప్లవ స్ఫూర్తి, ప్రజలు, మిత్రదేశాల సహకారం శత్రుసంహారం చేస్తాం.

 అయతుల్లా ఖమేనీ, 

ఇరాన్ సుప్రీంలీడర్ 

* ఇరాన్ ప్రయోజనాలు, పౌరుల రక్షణలో భాగంగానే దాడులు ప్రారంభించాం. ఇరాన్ యుద్ధాన్ని కోరుకునే దేశం కాదని నెతన్యాహుకు తెలియజేయండి. ఈ దాడులు మాలో ఒక కోణం మాత్రమే. మాతో ఘర్షణకు దిగడం అంతమంచిది కాదు. 

 మసూద్ పెజెష్కియాన్, 

ఇరాన్ అధ్యక్షుడు  

* ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేస్తున్న దాడులు విఫల ప్రయోగం. ఎలాంటి ప్రభావం చూపలేదు. మా ప్రయోజనాల కోసం ఇరాన్‌కు వ్యతిరేకంగా వెళ్లేందుకు అమెరికా వెనకాడబోదు. ఇజ్రాయెల్‌కు మా మద్దుతు ఎప్పటికీ ఉంటుంది.

 జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

* పశ్చిమాసియాలో ఇరాన్ ప్రమాదకరదేశం. అస్థిరపరిచే శక్తి. ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నాం.

 కమలా హ్యారిస్, 

అమెరికా ఉపాధ్యక్షురాలు

* భారత్ పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలపై ఆందోళన చెందుతో ంది. అక్టోబర్ 7 దాడిపై ఇజ్రాయెల్ ప్రతిస్పందనను అర్థం చేసుకున్నాం. చర్చలతో ఘర్షణలను ఆపవచ్చని నేను భావిస్తున్నా. 

 జైశంకర్, 

భారత విదేశాంగ మంత్రి