calender_icon.png 2 October, 2024 | 10:06 AM

మహిళా ఆర్థికాభివృద్ధికే డబ్ల్యూఈపీ

02-10-2024 12:33:38 AM

నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాం తి): దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభు త్వం విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫాం (డబ్ల్యూఈపీ) చాప్టర్‌ను ప్రారంభించిందని నీతి అయోగ్ సీఈవో, డబ్ల్యూఈపీ చైర్మన్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తెలంగాణలోని మహిళల కోసం డబ్ల్యూఈపీ చాప్టర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. మహిళలను స్వయంగా అభివృద్ధి చేసేందుకు వారికి అన్ని రంగాల్లో చేయూతను ఇవ్వడానికి, డబ్ల్యూఈపీ చాప్లర్ ఎంతగానో దోహదపడు తుందని చెప్పారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయడంలో అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ డబ్ల్యూఈపీ చాప్టర్‌ను ముందు కు తీసుకెళ్లి మహిళల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తామని తెలిపారు. దీనిని మండ ల, గ్రామీణస్థాయిలో కూడా విస్తరించి డబ్ల్యూఈపీ చాప్టర్‌ను అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేస్తామని వెల్లడించా రు.

మహిళలు ఈ కార్యక్రమం ద్వారా ముం దుకు రావాలని, కుటుంబ బాధ్యతతోపాటు తమలోని నైపుణ్యాన్ని వెలికి తీయాలని సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమ ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, నీతి అయోగ్ వైస్ చైర్మన్, డైరెక్టర్ అన్నారాయ్, డబ్ల్యూఈపీ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ సంగీతారెడ్డి, వీబ్ హబ్ సీఈవో సీతా పల్లచొళ్లా, వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.