calender_icon.png 22 December, 2024 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదరగొట్టిన జైస్వాల్, గిల్

18-07-2024 12:27:01 AM

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్

దుబాయ్: జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకొని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు. సీనియర్ల గైర్హాజరీ లో జట్టును నడిపించిన శుబ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో నాలుగు స్థానాలు ఎగబాకిన జైస్వాల్ (743 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో నిలిచాడు.

ఏకంగా 36 స్థానాలు జంప్ కొట్టిన గిల్ 46వ ర్యాంకులో నిలవగా.. రుతురాజ్ గైక్వాడ్ 8వ స్థానానికి పడిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ (797 పాయింట్లు) రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా.. ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ (844 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. బౌలర్ల విభాగంలో టాప్ భారత్ నుంచి ఒక్క బౌలర్ కూడా చోటు దక్కించుకోలేదు. అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు దిగజారి 13వ స్థానంలో నిలిచాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో బౌలింగ్‌లో ఆకట్టుకున్న ముకేశ్ కుమార్ 46వ స్థానంలో నిలిచి సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్ 21 స్థానాలు ఎగబాకి 73వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ 6, 13వ స్థానాల్లో నిలిచారు.