నార్త్ సౌండ్: టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ రికార్డు విజయం సాధించింది. గ్రూప్ భాగంగా శుక్రవారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో 101 బంతులు మిగిలుండగానే ఒమాన్‌ను చిత్తుచేసిన ఇంగ్లండ్.. మిగిలి ఉన్న బంతుల పరంగా అతి పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సూపర్ అర్హత సాధించగా.. తాజా విజయంతో ఇంగ్లండ్ రన్‌రేట్ మెరుగు పర్చుకుంది. మొదట ఒమాన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకే ఆలౌటైంది. షోయబ్ ఖాన్ (11) ఒక్కడే రెండంకెల స్కోరు చేశాడు.
ఇంగ్లిష్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4, ఆర్చర్, వుడ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 3.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. కెప్టెన్ బట్లర్ (24 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), సాల్ట్ (12; 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ నెట్ రన్‌రేట్ ఉండగా.. భారీ గెలుపుతో అది కాస్తా 3.081కు దూసుకెళ్లడం కొసమెరుపు. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో నమీబియాతో ఇంగ్లండ్, నేపాల్‌తో దక్షిణాఫ్రికా, ఉగాండాతో న్యూజిలాండ్ తలపడనున్నాయి.