calender_icon.png 22 January, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్ సువర్ణ!

05-07-2024 12:26:28 AM

మహిళా పోలీస్ షూటర్‌కు సీపీ అభినందన

హనుమకొండ, జూలై 4 (విజయక్రాంతి): ఇటీవల రాష్ట్రస్థాయి మహిళా ఓపెన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఏఎస్సై సువర్ణను వరంగల్ సీపీ అంబర్ కిషోర్‌ఝా గురువారం అభినందించారు. వరంగల్ కమిషనరేట్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న సువర్ణ గత నెల 21 నుంచి 28 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా ఓపెన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 50 మీటర్ల రైఫిల్ ఫ్రోన్ మాస్టర్స్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించారు. అలాగే గత నెల 15 నుంచి 20 వరకు తమిళనాడులో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ స్పెషల్ మహిళా షూటింగ్ పోటీల్లో సువర్ణ తెలంగాణ తరఫున పాల్గొని ఐదో స్థానంలో నిలిచారు. ఈ మేరకు సువర్ణను సీపీ అంబర్ కిషోర్‌ఝా పుష్పగుచ్చం అందజేసి అభినందించారు.