calender_icon.png 1 January, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్ కోమటిరెడ్డి

30-12-2024 02:18:04 AM

ట్రిపులార్ టెండర్లపై మంత్రికి సీఎం అభినందన

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను టెండర్ల దశకు తీసుకురావడంలో కీల కపాత్ర పోషించిన ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.

శనివారం ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం టెండర్లను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిన నేపథ్యంలో ఆదివారం కోమటిరెడ్డికి ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభినందిం చారు. మీ కృషి, సహకారం, సలహాతోనే ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కిందని సీఎంతో కోమటిరెడ్డి తెలిపారు.

2017లో ఆగిపోయి న ప్రాజెక్టు సీఎం సహకారంతో ఏడాదిలోనే సాధ్యమైందని కోమటిరెడ్డి తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు మంజూరు చేసిన కేంద్ర మం త్రి నితిన్ గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని కోరారు.