calender_icon.png 19 January, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్ పిల్లలు...

03-09-2024 12:14:30 AM

  1. రోడ్డుపై బుంగ.. 
  2. వాహనదారులను అప్రమత్తం చేసిన పిల్లలు

బెల్లంపల్లి, సెప్టెంబర్ 2: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లోని బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానానికి వెళ్లే రహదారి మధ్యలో వర్షా నికి బుంగపడి ప్రమాదకరంగా మారింది. గమనించిన కన్నాల గ్రామానికి చెందిన కొంత మంది చిన్నారులు అటుగా వస్తున్న వాహనదారులను అప్రమత్తం చేశారు. రోడ్డుపై బుంగ పడింది, పక్క నుంచి వెళ్లాలంటూ వాహనదారులకు సూచనలు చేశా రు. చిన్నా రులు ఆదిత్య, సుశాంత్, అజయ్, శ్రీఖర్, మణి వాహనదారులను అప్రమత్తం చేస్తూ గంట సేపు వర్షంలో అక్కడే ఉన్నారు.