- 150 కి.మీ మేర సముద్రాన్ని ఈదిన స్విమ్మర్‌గా రికార్డు
- హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అభినందన
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): వారంరోజుల్లో ఏపీలోని విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 150 కి.మీ మేర బంగాళాఖాతాన్ని ఈదిన స్విమ్మర్‌గా గోలిశ్యామల అరుదైన రికార్డు సృష్టించారు. ఆమెకు ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాల్ చేసి అభినందనలు తెలిపారు.
52 ఏళ్ల వయస్సులో సముద్రంలో ఈదడం ఎంతో కష్టతరమైన ఫీట్ అని, ఆ ఫీట్‌ను శ్యామల సునాయాసంగా సాధించారని కొనియాడారు. ఆమె గతంలో రామసేతు, శ్రీలంక, లక్షద్వీప్ సముద్ర జలాల్లోనూ అనే ఫీట్లు చేశారని, ఇదే ఒరవడిలో కొత్త రికార్డులు నెలకొల్పాలని ఆకాంక్షించారు.