calender_icon.png 16 January, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్ డ్రైవర్.. కండక్టర్

10-09-2024 04:18:28 AM

గుండెనొప్పి వచ్చిన విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ సిబ్బంది

నిర్మల్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన కిరణ్ అనే విద్యార్థి తల్లితో కలిసి సోమవారం భైంసా నుంచి నిర్మల్‌కు ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. నర్సాపూర్ వద్ద ఒక్కసారిగా ఛాతినొప్పి రావడంతో కిరణ్ తల్లి కండక్టర్, డ్రైవర్‌కు తెలిపింది. వారు వెంటనే నర్సాపూర్ పీహెచ్‌సీకి బస్సును తీసుకెళ్లారు. అప్పటికే ఆసుపత్రి వైద్యులకు సమాచారం ఇవ్వడంతో డాక్టర్ విజయానంద్ ఆధ్వర్యంలో కిరణ్‌కు చికిత్స అందించడంతో కోలుకున్నాడు. దీంతో డ్రైవర్, కండక్టర్‌కు కిరణ్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.