calender_icon.png 20 September, 2024 | 6:09 PM

సంక్షేమ పథకాలు అర్హుల దరిచేరాలి

07-09-2024 12:04:31 AM

ఎంపీ రఘునందన్‌రావు

మెదక్, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) మొదటి సమావేశంలో ఆయన అధికారుతలో సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ.. కేంద్ర, రాష్ట్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపట్టాలన్నారు.

మెదక్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. సెయిల్ హెల్త్ కార్డు కోసం నార్సింగి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల గురుకులాల్లో పనిచేస్తున్న 6,200 మంది తాత్కాలిక టీచర్లు రోడ్డున పడ్డారని ఎంపీ దుయ్యబట్టారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవా లన్నారు.

ఈ సమావేశంలో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, మెదక్, తూప్రాన్, నర్సాపూర్ మున్సి పల్ చైర్మన్లు చంద్రపాల్, మామిడ్ల జ్యోతి, అశోక్‌గౌడ్, డీఆర్‌డీవో శ్రీనివాసరావుతో పాటు వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బందికి ఎంపీ రఘునందన్‌రావు మట్టి గణప తులను అందించారు.