calender_icon.png 1 May, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

29-04-2025 12:00:00 AM

టీపీసీసీ పరిశీలకుడు జంగా రాఘవరెడ్డి 

బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 28 : ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అం దేందుకు కార్యకర్తలు కృషి చేయాల ని టీపీసీసీ పరిశీలకుడు మంచిర్యా ల జిల్లా ఇన్చార్జి జంగ రాఘవరెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఆర్పి గార్డెన్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బెల్లం పల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు.

పార్టీ శ్రేణు లు ఐక్యమత్యంతో ఉంటేనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజా పాలన పథకాలు ప్రతి పేదవాడికి దక్కే విధంగా కార్యకర్తలు నాయకులు పాటుపడాలని ఉద్బోధించారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. గ్రూపులకు తావు లేకుండా పనిచేసిన వారి కి ప్రాధాన్యత ఉంటుందన్నారు. డీసీసీ అధ్యక్షురాలు సురేఖ నాయకులు కార్యకర్తలతో రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేపించారు.

ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీపై కెసిఆర్ అనుచిత వాక్యాలు చేయడం సరికాదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపి కలో అవకతవకలను సహించేది లేదన్నారు. సమావేశంలో  టీపీసీసీ నెంబర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు పాల్గొన్నారు.