calender_icon.png 29 April, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

28-04-2025 10:31:11 PM

టీపీసీసీ పరిశీలకుడు జంగ రాఘవరెడ్డి...

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేందుకు కార్యకర్తలు కృషి చేయాలని టీపీసీసీ పరిశీలకుడు మంచిర్యాల జిల్లా ఇన్చార్జి జంగ రాఘవరెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఆర్పి గార్డెన్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రేణులు ఐక్యమత్యంతో ఉంటేనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజా పాలన పథకాలు ప్రతి పేదవాడికి దక్కే విధంగా కార్యకర్తలు నాయకులు పాటుపడాలని ఉద్బోధించారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.

గ్రూపులకు తావు లేకుండా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. డిసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జై బాబు, జై భీమ్, జై సంవిధానం కార్యక్రమంలో భాగంగా నాయకులు కార్యకర్తలతో రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేపించారు. కాశ్మీర్ పహల్దాoలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతికి రెండు నిమిషాలు మౌన పాటించారు. అనంతరం బెల్లంపల్లి ఎమ్మెల్యే  గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీపై కెసిఆర్ అనుచిత వాక్యాలు చేయడం సరికాదన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలను సహించేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం  కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నాయకులకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి పేదవాడికి అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి సన్న బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  అందిస్తుందన్నారు. సమావేశంలో  టిపిసిసి నెంబర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.