25-03-2025 12:00:00 AM
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ దండే విఠల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం కౌటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘జై బాబు జై భీమ్ జై సంవిధాన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాం గాన్ని పరిరక్షించేందుకే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ ఎంపీపీలు విశ్వనాథ్, నానయ్య పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి24 (విజయక్రాంతి)