ప్రతి పేదవాడి గడపకు సంక్షేమ పథకాలు అందాలి
ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపు
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రజా పాలన వారోత్సవాల సందర్భంగా ఇందిరమ్మ కమిటీ, ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా టిపిసిసి కమిటీ ప్రధాన కార్యదర్శి బీరుగాని సౌజన్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యత పార్టీ కార్యకర్తలపైనే ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరూ గెలిపిస్తారని అన్నారు.
ఇల్లందు మున్సిపాలిటీ 24 వార్డులలో కమిటీలు వేసి పార్టీ బలోపేతం చేయాలని కోరారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకుండా, పది సంవత్సరాలు పబ్బం గడిపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఇప్పటికే ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 500 కే సిలిండర్, రైతు రుణమాఫీ, అతి త్వరలో ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం ఇవ్వబోతుందని అన్నారు. అన్ని సేవల కు అనుగుణంగా డిజిటల్ రేషన్ కార్డ్ త్వరలో రాబోతుందని తెలిపారు. సంక్షేమ పథకాలు ముందుగా పేదలకు అందేలా నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇప్పటికే బీజేపీ గ్రాఫ్ దేశంలో తగ్గిపోయిన విషయం గత పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
పార్టీపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను వెంటనే తిప్పి కొట్టాలి తెలిపారు. తప్పుడు ఆరోపణ చేస్తూ ముఖ్యమంత్రి ప్రభుత్వం బధనం చేస్తున్న విషయాలపై మీడియా ఇతర మార్గాల ద్వారా ఖండించాలన్నారు. గత ప్రభుత్వాల్లో రాజకీయ నాయకులు దళిత బంధు పై కమిషన్లు అందుకొని ప్రజలను మోసం చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో కబ్జాలు దండాలు అధికారులని వారి పనిని వారు చేసుకొని ఇవ్వకుండా స్టేషన్లలో సెటిల్మెంట్లు చేసేవారు కానీ ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు. అధికారులంతా వారి వారి విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ సౌజన్య, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రెటరీ గోచికొండ శ్రీదేవి, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్ రావు, వైస్ చైర్మన్ జానీ పాషా, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎద్దులపల్లి అనసూయ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్, నియోజకవర్గ నాయకులు మడుగు సాంబమూర్తి, బొల్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, కౌన్సిలర్స్, 24 వార్డులకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.