ఎంపీడీఓ రాజేశ్వర్...
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్(Mandal Parishad Development Officer Rajeshwar) కోరారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల సర్వేను పరిశీలించి మాట్లాడారు. అధికారులు సర్వేను పారదర్శకంగా చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వీరేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కామెర బాలయ్య, ఓదెల సంపత్ రావు, దుర్గం సుధాకర్ పాల్గొన్నారు.