జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు...
కామారెడ్డి (విజయక్రాంతి): అర్హులందరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చూడాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పిట్లం ఎమ్మార్వో, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఈ నెల 26 నుండి రైత భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయబోతుందన్నారు. అదే విధంగా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్న సందర్భంగా వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అర్హులందరికి ఈ పథకాలు అందేలా చూడాలని, పథకాల అమలలో ఎటువంటి నిర్లక్ష్యం జాప్యం జరగకూడదని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అధికారులను ఆదేశించారు.