calender_icon.png 27 April, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలుపరచాలి

26-04-2025 06:22:47 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి చట్టం లను సమర్థవంతంగా అమలు పరచాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V. Patil) అన్నారు. శనివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపిక, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన, భూభారతి చట్టం, జలసంచై జన్ భాగి దారి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, పాము పౌండ్స్ నిర్మాణం, త్రాగునీటి సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లకు గాను ఇప్పటికే మొదటి విడతలో మండలానికి ఒక గ్రామపంచాయతీ ఎంపిక చేశామని, మిగిలిన గ్రామపంచాయతీలలో లబ్ధిదారుల అర్హుల జాబితా క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తమ వద్దకు వచ్చిన జాబితాను సంబంధిత మండలాల ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్ల కు అందజేసి వారు స్థానికంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు పంచాయతీ సెక్రటరీలతో సమన్వయం పరచుకొని ఉన్న జాబితాలో పేదల్లో నిరుపేద వారిని గుర్తించి అర్హుల జాబితా రూపొందించాలన్నారు. 

జిల్లా వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకం లో భాగంగా వచ్చిన దరఖాస్తులన్నీ త్వరితగతిన పరిశీలన చేపట్టి అర్హుల జాబితా రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను ఆయా కార్పొరేషన్ల వారీగా క్షేత్రస్థాయిలో బ్యాంకర్లతో కలిసి పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని అన్నారు. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్న వారికి వ్యవసాయ ఆధారిత యూనిట్లు స్థాపన చేసేలా అవగాహన కల్పించాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి జిల్లాలో అమలులో భాగంగా రెవెన్యూ రికార్డులను సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. నాన్ డిఎస్ కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్ భూ సమస్యల దరఖాస్తులను నివేదిక అందించాలని ఆదేశించారు.