చేర్యాల (విజయక్రాంతి): సంక్షేమ పథకాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. చేర్యాల పట్టణంలోని ఈడెన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. మూసి సుందరీకరణ బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలి అన్నారు. కార్మికుల కనీస వేతనాలను సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్లు, పత్తి త్వరితగతిన కొనుగోలు చేసి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు.
గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై ఉక్కు పాదం మోపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్న, వారి సమస్యలకు పరిష్కారం చూపడం లేదన్నారు. కేంద్రంలో బిజెపి ఆలంబిస్తున్న విధానాల వల్ల నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్ ను కట్టడి చేసి, పౌరసరఫరాల శాఖను సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శశిధర్, సత్తిరెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.