11-04-2025 01:31:01 AM
మహాత్మా ఫూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నివాళి
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): -మహాత్మా జ్యోతిరావు ఫూలే అను సరించిన మార్గం అందరికీ ఆచరణీయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఏప్రిల్ 11న ఫూలే 198వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. సామాన్యు డిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగారని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అ నుసరించిన మార్గం స మాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. మహాత్మా జ్యోతిబాఫూ లే స్ఫూర్తితోనే రాష్ర్ట ప్రభుత్వం అనేక వినూ త్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతిభవన్‌కు మహాత్మా జ్యోతిబాఫూలే పేరుపెట్టి ప్రజాభవన్‌గా మార్చడం జరిగింది.” అని ఆయన కొనియాడారు. దేశంలోనే తొలిసారిగా కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించామని సీఎం పేర్కొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అధికారులు అప్రమ త్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో రెండురోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు వివిధ జిల్లాల్లో కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు.
సామాజిక దార్శనికుడు ఫూలే చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కో సం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మ హాత్మా జ్యోతిరావుఫూలే అని శాసన మం డలి చైైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో అన్నారు. సమాజంలో కుల, లింగ వివక్షతకు తావులేకుండా అన్నివర్గాలకు విద్య అందాలని ఫూలే భావించార న్నారు. మహాత్మా ఫూలే చూపిన మార్గంలో నడుస్తూ, ప్రభుత్వం బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పనిచే స్తోందని పేర్కొన్నారు.