- ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రాష్ట్రప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
గణతంత్ర దినోత్సవం రోజుజే రాష్ట్రప్రభుత్వం రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు శ్రీకారం చుట్టడం ఆనందాన్నిస్తోందన్నారు. తెలంగాణకు ప్రపంచస్థాయి గుర్తిం పు రావాలన్న ధ్యేయంతో ‘తెలంగాణ రైజింగ్’ బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాష్ట్రప్రజలందరూ తెలంగాణ పునః నిర్మాణం లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.