calender_icon.png 21 February, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు అర్హులకు సంక్షేమ పథకాలు

26-01-2025 12:04:07 AM

  1. మండలంలో ఒక గ్రామం ఎంపిక
  2. ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారి: సీఎస్

హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామా న్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు గణతంత్ర దినోత్స వం సందర్భంగా రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అందిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.

హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. రేషన్‌కార్డుల జారీకి తహసీల్దార్, ఇందిరమ్మ ఇండ్లకు ఎంపీడీవో, రైతుభరోసాకు ఏవో లేదా డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఉపాధి హామీ ఏపీవో ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించా రు.

పథకాల పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని, సభలకు లబ్ధిదారులందరూ హాజర య్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పథకానికి ఎంపికైన వారి జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించాలన్నారు. నాలుగు పథకాల అమలుకు ప్రతి మండలానికో ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.

సమీక్షలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యాలయ కార్యదర్శు లు శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, రెవెన్యూశాఖ ము ఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధప్రకాశ్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు.