రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి హరిచందన...
సంగారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి హరిచందన తెలిపారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలంలోని చెరాగ్‌పల్లి గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందించేందుకు గ్రామ సభలు నిర్వహించి, దరఖాస్తులు తీసుకోవడం జరిగిందన్నారు. అధికారులు సంక్షేమ పథకాల అమల్లో బాధ్యతగా పని చేయలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ మాధూరి, కాంగ్రెస్ నాయకులు ఉజ్వాల్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి బిక్షపతితో పాటు వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.